ముస్లీం మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుంది

ముస్లీం మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుంది
  • రూ.57.50 లక్షలతో షాదీ ఖానా పనులు ప్రారంభం
  • ఎమ్మెల్యే దివాకర్ రావు

ముద్ర, లక్షెట్టిపేట్ : ముస్లీం మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానికనాయకులతో కలిసి సిలువ గుట్ట వద్ద ముస్లిం మైనారిటీ షాదీ ఖానాకు భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ...... ముస్లిం మైనార్టీల చిరకాల వాంఛ అయిన షాదీ ఖానా రూ 57.50 లక్షలతో బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో నిర్మిస్తున్నామన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం షాదీ ముబారక్, రంజాన్ తోఫా లాంటి సంక్షేమ పథకాలను
బీఆర్ఎస్ ప్రభుత్వం  ప్రవేశపెట్టిందన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ప్రతిక్షణం పాటుపడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వర్గానికి, కులానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లో మాత్రమే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కెసిఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వ లేకనే కొందరు అవాకులు చివాకులు పేలుతున్నారని అన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు ఇలాంటి అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు? ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మెన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ శాతరాజు రాజన్న , సురేష్ నాయక్, శ్రీకాంత్,సజ్జు, మైనారిటీ అధ్యక్షుడు కో ఆప్షన్ సభ్యులు షాహిద్ అలీ, వెంకటస్వామి గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.