వీధి కుక్క దాడిలో గాయపడిన బాలుడు

వీధి కుక్క దాడిలో గాయపడిన బాలుడు

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సౌల్ల తండా శివారు భాడ్వతండాలో శుక్రవారం సాయంత్రం వీధి కుక్క దాడిలో భూక్య శ్రీధర్ అనే మూడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తండాకు చెందిన ముఖ్య కిషన్ కుమారుడు శ్రీధర్ ఇంటి ముందు ఉండగా వీధి కుక్క ఒక్కసారిగా వచ్చి అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడ్డ శ్రీధర్ ను వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.