కొనుగోలు చేసిన ధాన్యం  నిల్వ ఉంటే తక్షణ చర్యలు... 

కొనుగోలు చేసిన ధాన్యం  నిల్వ ఉంటే తక్షణ చర్యలు... 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్:ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణం తరలించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక హెచ్చరించారు.మహబూబాబాద్ లో గురువారం ఐడిఓసిలోని కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరును ఐకెపి ఫ్యాక్స్ జిసిసి సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి కలెక్టర్ శశాంక సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టకపోవడం, అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించే విధానంలో జాప్యం చేయడం తన దృష్టికి వచ్చిందని ఇకపై అధికారులు సమయానుకూలంగా స్పందించకపోతే తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.లారీలు ఏర్పాటు చేసుకోవడంలో 30 కిలోమీటర్ల లోపు ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవడంలో సెంటర్లలో రైతులకు వసతులు కల్పించకపోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉదయం 9 గంటలకల్లా లారీలు ట్రాక్టర్లు కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో ఉండాలని 10 గంటల తర్వాత కొనుగోళ్లు నిర్వహించాలని సాయంత్రం మూడు నుండి ఐదు గంటల లోపు రవాణా చేపట్టాలన్నారు.
కరీంనగర్, వరంగల్ హనుమకొండలలో లారీలు పంపేందుకు అనుమతి లభించిందని జాప్యం చేయరాదన్నారు. తేమశాతాన్ని బట్టి కొనుగోళ్ళను వేగవంతం చేసి సాధ్యమైనంత వరకు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిలవ ఉండకుండా చూడాలన్నారు.
ఈసమావేశంలో అదరపు కలెక్టర్ డేవిడ్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, సహకారశాఖ అధికారి ఖుర్షీద్, మార్కెటింగ్ అధికారి వెంకటరెడ్డి, ప్రాథమిక సహకార సంఘ సీఈఓ లు, ఐకెపిఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు