సీఎం కప్ ఖో ఖో పోటీలో కేసముద్రం ఫస్ట్ ప్లేస్ 

సీఎం కప్ ఖో ఖో పోటీలో కేసముద్రం ఫస్ట్ ప్లేస్ 

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడల్లో కేసముద్రం మండల ఖో ఖో జట్టు కొత్తగూడ మండల జట్టుపై విజయం సాధించి జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేస్తుందని ఫిజికల్ డైరెక్టర్ నాగయ్య తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీల్లో కేసముద్రం జట్టు క్రీడాకారులు అత్యంత ప్రతిభ చాటారని ఆయన తెలిపారు. ప్రథమ స్థానం పొందిన కేసముద్రం జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు.