నిషేధిత పొగాకును తరిమికొడదాం.. ధూమపానాన్ని వదిలేద్దాం

నిషేధిత పొగాకును తరిమికొడదాం.. ధూమపానాన్ని వదిలేద్దాం

గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ వీరన్న

గూడూరు మే 31 (ముద్ర): ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతోమంది పొగాకు బానిసగా మారి తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని అలాంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులను వదిలేయాలని గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ వీరన్న, దంత వైద్య నిపుణుడు భరత్ రెడ్డి కోరారు. బుధవారం ప్రపంచ  పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈరోజు ఎంతోమంది సిగరెట్ కు బానిసలుగా ఉన్నారని సిగరెట్ పొగాకు సంబంధించిన ఉత్పత్తులను వాడడం ద్వారా  కాలేయం ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోతాయని సిగరెట్ తాగుతున్న వారు తమ జీవితాన్ని తామే కాల్చుకున్నవారుగా మారతారని అన్నారు. సిగరెట్ తాగేవారు తమ కుటుంబాన్ని మోసం చేస్తున్నారని తాగడం ద్వారా తమతో పాటు కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా అనారోగ్యానికి గురవుతారని విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

యువత ఎక్కువ శాతం పొగాకు ఉత్పత్తులకు ఆకర్షించబడుతున్నారని మొదటగా యువకులకు పొగాకు పట్ల ఒక అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా సూచించారు.  చాలామంది ఈరోజు పొగాకు ఉత్పత్తులను వాడి క్యాన్సర్ మహమ్మారిని తగిలించుకుంటున్నారని దయచేసి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు.