9ఏళ్ళలో గిరిజనులకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు - వెంకటేష్ చౌహాన్ నాయక్

9ఏళ్ళలో గిరిజనులకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు - వెంకటేష్ చౌహాన్ నాయక్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ)ఆధ్వర్యంలో సింగల్ విండో మీటింగ్ హల్ లో, గిరిజన అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ అధ్యక్షతన జరిగిన  సభలో, బిఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డా. వెంకటేష్ చౌహాన్ నాయక్ మాట్లాడుతూ 9ఏండ్లల్లో ఒక్క రోజు గిరిజనులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించ్చారు.

పోడు రైతులకు సంకెళ్లు వేసింది కెసిఆర్ కాదా అనీ నీలదీశారు. ఇప్పుడు ఎన్నికల కోసం పోడు రైతులకు పట్టాలు ఇస్తానని మరో మోసానికి తెర లేపుతున్నరని దుయ్యబట్టారు. సీఎం కెసిఆర్ కు ఎస్టీలపై ప్రేమ వుంటే ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఎందుకు ఖాళీగా ఉంటుందని గర్జించారు. తండాలు గ్రామ పంచాయతీలుగా చేసిన వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.

తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా చేసినప్పుడు మాత్రమే, గిరిజనులకు పూర్తి న్యాయం జరుగుతుందని తెలిపారు. గిరిజన బంధు జాడ తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇ 9ఏళ్ళల్లో గిరిజన తండాల్లో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు మరోసారి గిరిజనులను మోసం చేయాలని చూస్తే, గిరిజనుల ముందు కెసిఆర్ ఆటలు సాగవని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో గిరిజనులు అంత బిఎస్పీ పార్టీకి మద్దత్తు ఇవ్వాలని కోరారు.

బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాత్రమే గిరిజనులకు పూర్తి న్యాయం చేస్తారని వివరించారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ దేవరకొండ అసెంబ్లీ అధ్యక్షులు రమావత్ రమేష్ నాయక్, బివిఎఫ్ రాష్ట్ర కో- కన్వీనర్ బాబు నాయక్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఇంచార్జ్ కోనేటి సుజాత, పీయూ జేఏసీ నాయకుడు రూప్ సింగ్ నాయక్ లు మాట్లాడారు. ఇ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కందికంటి విజయ్, పసుపుల రామకృష్ణ, జిల్లా ఇంచార్జ్ బీసమొల్ల యోసెఫ్, జిల్లా అధ్యక్షులు కారంగి బ్రహ్మయ్య, మహిళ జోనల్ కన్వీనర్ రాములక్క, జిల్లా కార్యదర్శి బోనాసి రాంచందర్, నాయకులు పృథ్వీ రాజ్, కళ్యాణ్, మహేష్ యాదవ్, దాస్ ముదిరాజ్, కొట్ర బాలు, కృష్ణ రజక లు పాల్గొన్నారు.