సామాజిక దార్శనికుడు జ్యోతిభా పూలే...

సామాజిక దార్శనికుడు జ్యోతిభా పూలే...
Mahbubabad District Collector Shashanka

మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: సామాజిక దార్శనికుడు, మార్గదర్శకుడు జ్యోతిభా పూలే అని జిల్లా కలెక్టర్ శశాంక కొనియాడారు. మహబూబాబాద్ లో మంగళవారం  పత్తిపాక రోడ్ లో బిసిసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిభాపూలే 197వ జయంతి ఉత్సవ వేడుకలను పురస్కరించుకుని  ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి లతో కలిసి కలెక్టర్ శశాంక జ్యోతిభాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసారు.

అనంతరం  జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ...

విద్యతోనే సామాజిక రుగ్మతలను, అసమానతలను రూపుమాపవచ్చని గ్రహించి  ఉపాధ్యాయురాలు అయిన వారి సతీమణితో వాడవాడలా పాఠశాలలను బాలికల కొరకు నెలకొల్పి మహిళలకు విద్యానందించి చైతన్య వంతులను చేసిన మహోన్నతవ్యక్తి పూలే అన్నారు. స్వేచ్ఛ సమానత్వం, ఐకమత్యం కొరకు చేసిన కృషి అపారమైనదని కీర్తించారు. మహిళలపై వివక్ష తొలగించేందుకు, సమాజ చైతన్యానికి కృషి చేస్తూ, అసమానతలు తొలగించేందుకు ప్రయత్నం చేసినప్పుడే ఆ మహానుభావునికి అర్పించి నిజమైన నివాళి అన్నారు.జిల్లాలో 14 వసతి గృహాల్లో 1400 మందికి విద్యానభ్యసించేందుకు అవకాశముండగా 1027 మంది ఉన్నారని, ఎక్కువ మంది వినియోగించుకునేలా కృషి చేయాలన్నారు. 5 బిసి గురుకులాల్లో పోటీ పడుతూ 240మంది విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ...
సమానత్వంతో మహిళల విద్యకు చైతన్యదీప్తి అని, వితంతు మహిళల బాసటగా నిలిచారన్నారు. జిల్లాకేంద్రంలో  వెనుకబడిన తరగతుల సంక్షేమ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిధులు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి,  వైస్ చైర్మన్ ఫరీద్, ఏఎస్పీ చెన్నయ్య, బిసి సంక్షేమాధికారి నరసింహస్వామి, వివిధ సంఘ నాయకులు గుగులోత్ కిషన్ నాయక్, భూపతి మహంకాళి, గట్టు ప్రభాకర్, సోమారపు వీరస్వామి, కామ సంజీవరావు, చందా గోపి, దుడ్డేల రామ్మూర్తి, గుండగాని వేణు,మంద శశి, విజయలక్ష్మి, రమేష్, జన్ను మహేందర్ తప్పెట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.