అటవీ అనుమతులు సత్వరమే పొందాలి... 

అటవీ అనుమతులు సత్వరమే పొందాలి... 

 మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్:ఏజెన్సీ ప్రాంతం మండలాల అయిన కొత్తగూడ, గంగారం మండలాలలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అనుమతులను సత్వరమే పొందాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.మహబూబాబాద్ లో గురువారం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఏజెన్సీ ప్రాంతాలలో చేపట్టే అభివృద్ధి పనులకు తీసుకోవాల్సిన అనుమతులపై జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్ తో కలిసి కలెక్టర్ శశాంక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ... కొత్తగూడ, గంగారం మండలాలలో చేపట్టే అభివృద్ధి పనులకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.
రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో గుంజేడు నుండి దుబ్బ గూడ, భూపతి పేట నుండి కొత్తగూడ, కొత్తగూడ నుండి పాకాల 3 రోడ్లకు అనుమతులు పొందాలన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 6రోడ్లకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు.ఐటిడిఏ ద్వారా 3 రోడ్లకు అనుమతులు పొందాలన్నారు. మత్స్యశాఖ ద్వారా చేపట్టనున్న పాండ్స్ నిర్మాణాలకు తీర్మానం పొందిన తర్వాతనే అనుమతి తీసుకోవాలని అన్నారు.ఈసమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి రవికిరణ్ , ఆర్డీఓ కొమరయ్య, ఇంజనీరింగ్ అధికారులు తానేశ్వర్, సురేష్, రామిరెడ్డి, గిరిజన సంక్షేమ అధికారులు నాగ సాగర్, ఏటిడబ్ల్యూఓ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.