పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సాధించాలి  : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సాధించాలి  : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఈనెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగని వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్  మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఐడీఓసీ కార్యాలయంలో మున్సిపాలిటీల్లో నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు, డీఈలు, ఏఈలు, శానిటరీ ఇన్​స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు యంత్రాలను వినియోగంలోకి తేవాలని కోరారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ నిరంతరం జరగాలని, ప్రతి రోజూ చేయాల్సిన కార్యక్రమాలని పేర్కొన్నారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. 
ఆకస్మిక తనిఖీ చేయాలని, ఆ తనిఖీ ఫొటోలు తనకు పంపాలని కోరారు.
స్వచ్ఛ వాహనం ప్రతి ఇంటికి వెళ్తున్నదా లేదా పర్యవేక్షణ చేయాలని అన్నారు.   ప్రతి ఇంటి నుండి చెత్త బయటకు రావాలని, సక్రమంగా చేయకపోతే వ్యర్థాలను మురుగుకాల్వల్లోను, బహిరంగ ప్రదేశాల్లో వేస్తారని, స్వచ్ఛ వాహనాలు సమయం ప్రకారం వెళ్లకపోతే వ్యర్థాలు పేరుకుపోయి బయట పడేస్తారని చెప్పారు. రానున్న 9 రోజుల పాటు పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పట్టణాలను శుభ్రం చేయాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో వ్యర్థాలను తొలగించాలని, ప్రైవేట్ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు శుభ్రం చేయించినందుకు అయిన వ్యయాన్ని వసూలు చేయాలని సూచించారు.

కూరగాయల షాపు పండ్ల షాపు దగ్గర కూడా చికెన్ మటన్ షాపుల దగ్గర ప్రతిరోజు ఒక జవాను తిరిగి చూడాలి నీటుగా వాసన లేకుండా ఉన్నాయో లేవని చూడాలి అలా అయితే చికెన్ షాప్ మటన్ షాప్ వాళ్ళు మున్సిపాలిటీ నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అని నీట్ గా పెట్టుకుంటారురోడ్ల పైన చెత్తను కవర్స్ గాని పేపర్స్ గాని ఉంటే ఒక సంచి పట్టుకుని వార్డులో తీసిన తర్వాత జాడు కొట్టాలి రోడ్డుపైన ఎక్కడన్నా నాల గుంతలు ఉంటే ఐడెంటిఫై చేసి తగు చర్యలు తీసుకోవాలి మున్సిపాలిటీ వాళ్లు  పనిచేస్తున్నప్పుడు  జాకెట్స్ ఎల్లో  ఆరెంజ్ వేసుకోవాలి ఎందుకనగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పని చేశారని అందరూ గుర్తిస్తారు.మున్సిపాలిటీల పరిధిలోని విడుదల చేసి మిషన్ భగీరథ నీటిపై సమీక్షించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.