ఘనంగా సీతారాముల వారి కళ్యాణోత్సవం

ఘనంగా సీతారాముల వారి కళ్యాణోత్సవం
  • కళ్యాణోత్సవం లో పాల్గొన్న మంత్రి జూపల్లి

ముద్ర.వీపనగండ్ల:-మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు, గ్రామాల్లోని ఆలయాల వద్ద కమిటీ నిర్వాహకులు గ్రామస్తులు రాములోరి కల్యాణోత్సవానికి ఆలయాల ఎదుట చలువ పందిళ్ళు వేసి వేద బ్రాహ్మణులతో సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోవర్ధనగిరి లో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.