బాన్సువాడ లో కిడ్నాప్ కలకలం    

బాన్సువాడ లో కిడ్నాప్ కలకలం    

బాన్సువాడ, ముద్ర : రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చిన్న పిల్లల కిడ్నాపింగ్ వదంతులు వ్యాపిస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన కు గురవుతున్నారు.  అయితే కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో వదంతులకు  బలం చేకూరుతోంది.   తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏర్రమన్ను కుచ్చలో కుల్దీప్ సింగ్ అనే బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది.   శనివారం రాత్రి  ఆటో లో వచ్చిన ఓ మహిళ కుల్దీప్ సింగ్ చేతులు పట్టుకుని లాక్కేల్లే ప్రయత్నం చేయగా బాలుడు చేతులు విడిపించుకుని తప్పించుకుని అరచాడని స్థానికులు తెలిపారు. అరవడం చూసి స్థానికులు మహిళను ను వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలిసులు విచారణ జరుపుతున్నారు. ఆ మహిళ ఎవరు, వీరికి గ్యాంగ్ ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.