ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలి

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలి
District Collector Tejas Nandulal Power

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: వైద్య సేవల కొరకు నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాలని District Collector Tejas Nandulal Power జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ వైద్యులకు వైద్య సిబ్బందికి ఆదేశించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికతనికి చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను కలెక్టర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యం ఎలా అందుతుందని, భోజన సదుపాయం కల్పిస్తున్నారా లేదా అంటూ రోగులను ప్రశ్నించారు.

అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో హాజరై వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ తో పాటు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.