చేసిన అభివృద్ధిని చెప్పుకుందాం ప్రజల ఆశీస్సులు తీసుకుందాం

చేసిన అభివృద్ధిని చెప్పుకుందాం ప్రజల ఆశీస్సులు తీసుకుందాం
  •  కార్యకర్తల సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి వారిని ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి టిఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాచార పంపిణీలో సోషల్ మీడియా విప్లవం కొనసాగుతున్నదని, ఉత్తరాలు ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా పోయాయని, విషయాల చేరువేత్తలో ఆయన అన్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల ప్రచారంలో ఒకప్పుడు గోడల రాతలు బట్ట బ్యానర్లు ఉండేవని, మారిన ఆధునిక యుగంలో సంపూర్ణంగా పరిస్థితి మారిపోయిందని దాని నేర్చుకొని ఆచరించేందుకు మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. జీవితం నేర్పిన పాఠాల నుండి ప్రజలు ఎంతో నేర్చుకుంటూ అన్ని విషయాలను నేర్చుకోవడం తెలుసుకోవడం జరుగుతున్నదని ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటే మనకన్నా అమాయకులు ఎవరు ఉండరని ఆయన అన్నారు.

ఒకప్పటి దూరదర్శిని స్థానంలో అనేక వందల న్యూస్ ఛానల్ వచ్చాయని, ఒకప్పటి దూరదర్శన్ స్థానంలో అనేక వందల ఛానల్ వచ్చాయని, గతంలో రెండు మూడు పత్రికలు ఉండేవని వందలు వేల సంఖ్యలో వచ్చాయని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో సమూల మార్పులు వచ్చాయని మారిన వార్తా ప్రపంచంలో సోషల్ మీడియాదే అగ్రస్థానం అని ఈ పేపర్లకు ఆదరణ పెరుగుతున్నదని ఆయన అన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా మత్స్య కళాశాలను పెబ్బేర్లో ఏర్పాటు చేశామని, ముందు చూపుతో పెబ్బేరు రహదారిలో వే సైడ్ మార్కెట్ను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ఎక్కడ లైన్ విధంగా 64 మినీ లిఫ్టులు ఏర్పాటు చేశామని, జేఎన్టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల సాధించామని, దేశంలో తొలి వ్యవసాయ డిగ్రీ కళాశాల వనపర్తి లో నెలకొల్పామని ఆయన చెప్పారు.

ఏ నియోజకవర్గంలో లేని విధంగా సొంత డబ్బుతో క్షయ వ్యాధిగ్రస్తులకు బలవర్ధక ఆహారం అందిస్తున్నామని, అన్ని వర్గాల ప్రజల కోసం సర్వవర్గ సామూహిక భవనాలు నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో మొదట ఐదు చట్టాలు తెచ్చి 55 రోజులలో నిర్మించామని తెలిపారు. త్వరగా పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి మరో 11 చెక్ డ్యాములు మంజూరు చేశారని ఆయన తెలిపారు. మంత్రిగా ఉండి రాష్ట్రంలోని అత్యధిక పల్లెనిద్రలు చేశానని తెలిపారు. తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే వనపర్తిలో కళాకారులకు పాటకు సత్కారం పేరుతో 200 మందిని సన్మానించుకున్నామని, తెలంగాణ ఏర్పడక ముందే ఈ ప్రాంతంలో అమరుల కుటుంబాలను సత్కరించు కున్నామన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన వనపర్తి అభివృద్ధి కోసం కృషి చేశానని ఆయన అన్నారు 2018 ఎన్నికల్లో నా పనిని గుర్తించిన ప్రజలు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్, వైస్ చైర్మన్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా శిక్షణ తరగతుల చైర్మన్ పురుషోత్తం రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి, సోషల్ మీడియా శిక్షకులు సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.