గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట: జిల్లా ఎస్పీ వినీత్ జి

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట: జిల్లా ఎస్పీ వినీత్ జి
Blocking illegal traffic of ganja District SP Vineeth G

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట చేస్తున్నామని జిల్లా ఎస్పీ వినీత్ జి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలంలో సీసీఎస్ పోలీసులు 488 కేజీల గంజాయిని పట్టుకున్నారని, దీని విలువ సుమారు 97 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని అభినందించారు.

Also Read: ఆర్ధిక నేరగాళ్ళకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న  ప్రధాని మోదీ

ఇప్పటివరకు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 18 మంది పై పిడి యాక్ట్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2023 జనవరి నుండి నేటి వరకు 11 కేసులలో 32 మందిని అరెస్టు చేసి 1.3 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కిన బూర్గంపాడు మండలం తాళ్లకొమ్మూరు చెందిన శివశంకర్ రెడ్డి, నాగేంద్రబాబులను తరలించినట్లు తెలిపారు.