సంస్కృతి, సంప్ర దాయాలను కాపాడాలి ప్రభుత్వ విప్ రేగా

సంస్కృతి, సంప్ర దాయాలను కాపాడాలి ప్రభుత్వ విప్ రేగా
Culture and traditions should be protected Government Whip Rega

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యేరేగా కాంతారావు అన్నారు. మంగళవారం మణుగూరు లోని క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...

 పండుగలు మన సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్తాయన్నారు, చిన్న పెద్ద, కులమత బేధం లేకుండా అన్ని వయసు వారు ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం ఆనాదిగా వస్తుందన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు, తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆచార సంప్రదాయాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు, తెలంగాణ రాష్ట్ర మరియు, జిల్లా, పినపాక నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.