మావోయిస్టు లు అరెస్ట్

మావోయిస్టు లు అరెస్ట్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిషేధిత మావోయిస్టు పార్టీ కి చెందిన ఎల్ వో ఎస్ కమాండర్, డిప్యూటీ దళకమాండర్ నుఅరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ జి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం శివారు ప్రాంతంలో భద్రాచలం పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో అనుమానస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించగా వారు మావోయిస్టులుగా తెలిసిందని తెలిపారు. చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన దుమాం ఎల్వో ఎస్ కమాండర్ కుంజా ఉంగల్, డిప్యూటీ దళ కమాండర్ మూషిక రాజెలుగా గుర్తించినట్లు తెలిపారు. మావోయిస్టులు సుమారు 10 కేసులలో నిందితులుగా ఉన్నారని ఎస్పీ తెలిపారు. నిషేధిత మావోయిస్టులకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరిస్తూ చట్టవ్యత్రిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి మావోయిస్టులు జనజీవన శ్రవంతులు కలవాలని ఆయన కోరారు.