హత్య కేసులో సంబంధంలేని ఆదివాసులను నిర్భందించవద్దు

హత్య కేసులో సంబంధంలేని ఆదివాసులను నిర్భందించవద్దు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : చర్ల మండలంలో జరిగిన రమేష్ హత్య కేసులో కేసుతో సంబంధం లేని అమాయక ఆదివాసీలను నిర్బంధించడం దారుణమని సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా  జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి,  మాజీ ఎమ్మెల్యే గుమ్మ డి నర్సయ్యులు అన్నారు. ఈ మేరకు గురువారం
 జిల్లా కేంద్రంలో ప్రజాపంధా  జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ ఎస్పీ సాయి మనోహర్  కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాజయ్య నగర్ గ్రామ ఆదివాసులను అదే గ్రామమైన సప్కా రమేష్ హత్య కేసు విషయంలో అనుమానితులుగా పోలీసులు 6 రోజులుగా నిర్భంధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని,నిర్ధోషులైన రాజయ్య నగర్ గ్రామస్థులను వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. రమేష్ హత్య బాధకరమణి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
  పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ  నిర్వహించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని , సప్కా రమేష్ కుటుంబాన్ని ప్రభత్వం ఆదుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమం లో పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్ మండల నాయకులు పాలెం చుక్కయ్య సుజాత నాయకులు
శివ గ్రామస్థులు జోగయ్య భీమాలు, రాజు, ఇడమా లక్ష్మి, సరిత, సమ్మక్క, తులసి కమలా దేవి తదితరులు పాల్గొన్నారు