ఆరోగ్య సదస్సు ను జయప్రదం చేయండి ప్రకృతి కవి జయరాజ్

ఆరోగ్య సదస్సు ను జయప్రదం చేయండి ప్రకృతి కవి జయరాజ్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం సంక్షోభంలో పడిందని, చేతులారా కొని తెచ్చుకునే జబ్బులు కొన్ని అయితే, సామాజిక ఆర్థిక పరిస్థితుల వలన మరిన్ని వ్యాధులు వెంటాడుతున్నాయని, ప్రముఖ ప్రజాకవి, గాయకుడు, ప్రకృతికవి, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమ నిర్వాహకులు, డాక్టర్. జి జయరాజు తెలిపారు. శనివారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటుచేసిన ఆరోగ్య సదస్సును విజయవంతం చేయాలని  కోరుతూ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలకు సరియైన ఆరోగ్యం అందించాలని, బలమైన కాంక్షతో కొత్తగూడెంలో, ఆరోగ్య సదస్సుని సింగరేణి ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. దీన్ని స్థానికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పటి బుద్ధుని కాలం నుండి, నేటి ఆధునిక యుగం వరకు, మన ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నామన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అని పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా ఏర్పాటుచేసిన సభ ద్వారా ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి డాక్టర్ గా మార్చలనేదే మా లక్ష్యం అని ఆయన వెల్లడించారు.

ఈ డాక్టర్స్ మీట్లో ..హోమియో వైద్య విధానం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన, గుడివాడకు చెందిన, డాక్టర్. చింతా రవీందర్(MD), హోమియో వైద్య నిపుణులు, పరిశోధకులు, శాస్త్రవేత్త (భారత కేంద్రీయ హోమియో పరిశోధన మండలి)., మహబూబ్నగర్ కు చెందిన ప్రముఖ యునాని వైద్యులు, సైంటిస్ట్, డాక్టర్.యమ్. ఏ. హకీమ్., హనుమకొండకు చెందిన యోగ- నేచురోపతి వైద్యులు, ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల్లో, సీనియర్ ఆకుపంచరు తెరపిస్ట్, డాక్టర్. అనిల్ టెంబరేణి లతో పాటు, విశిష్టాధితులుగా.. సింగరేణి సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ అండ్ 'పా'  బలరాం .ఐఆర్ఎస్.,  గౌరవ అతిధులుగా కొత్తగూడెం డిఎస్పి ఎస్కే అబ్దుల్ రహమాన్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సంఘం వెంకట పుల్లయ్య., ప్రముఖ సినీ సంగీత దర్శకుల సంఘం తెలంగాణ అధ్యక్షులు, గాయకులు బల్లెపల్లి మోహన్, స్థానిక  ప్రముఖ వైద్యులు డా. వి ఉపేందర్ రావు,  డా.జి. కనకరాజు,  డా.బి. నరేంద్ర కుమార్,  డా. అంబారుఖాన శ్రీధర గోపాలరావు, భద్రాచలం నేచురోపతి మెడికల్ ఆఫీసర్.డా. గైనకాలజిస్ట్ డా.బిందు పల్లవి, స్థానిక మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్, పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య, సదస్సు కోఆర్డినేటర్ డా. బత్తుల కృష్ణయ్యలు పాల్గొంటారన్నారు.