క్రీడాకారులు జాతీయ స్థాయి లో రాణించాలి

క్రీడాకారులు జాతీయ స్థాయి లో రాణించాలి
Sportspersons should success at the national level
  • క్రీడాపాఠశాలలో బోజనం, వసతిని ఆందిస్తాం
  • మౌళిక వసతుల అభివృద్దికి నిధులు
  • స్పోర్ట్ స్కూల్ కు సిసి రోడ్డు
  • ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా

ముద్ర ప్రతినిధి కరీంనగర్: ఆత్మవిశ్వాసంతో నేటి యువత క్రీడల్లో విజయాన్ని సాధించడమే కాదు దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలని రాష్ట్ర పంచాయితిరాజ్, గ్రామీణ అభివృద్ధి, యూత్ ఆండ్ స్పోర్ట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది పనులు,రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ లో  జిమ్నాస్టిక్, జిమ్, హస్టల్, మెస్ లను పరిశీలించి పిల్లలకు అందిస్తున్న భోజనం, వసతి ఇతరత్ర సదుపాయాలను అడిగితెలుసుకున్నారు.  ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, వసతి గృహాలు, పాఠశాలలను   ఉపాధ్యాయుల హెచ్ ఎం ను అడిగి తెలుసుకున్నారు. క్రీడా పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల  వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం  ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పిల్లలనుద్దేశించి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ జిమ్నాస్టిక్ శిక్షణ కొరకు మెటిరీయల్, పిల్లలకు బ్లాంకేట్లు మొదలగు మౌళిక వసతులను అందించడానికి నిధులను మంజూరుచేయిస్తానని తెలిపారు.

విశాలమైన పరిసరాలలో ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ స్కూల్ కు జిమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అందిస్తానని తెలిపారు.  పిల్లలు ఎదుర్కొంటున్నా సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, ఇందుకు అవసరమైన నిధులను కూడా ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ శాఖ ద్వారా ప్రతిరోజు పరిసరాలను శుభ్రం చేయించాలని తెలిపారు.  బైపాస్ నుండి వచ్చే  మార్గం లో సిసి రోడ్డు వేయిస్తానని తెలిపారు. వంటగదులలో ఫ్రిజ్ లను ఏర్పాటుచేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సహానందిస్తుందని,  ఇందుకు బదులుగా మీరందరు ప్రాక్టీస్ చేసి మీపై ఉన్న నమ్మాకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.   ఖేలో ఇండియాలో  తెలంగాణ  ఇప్పటికే 25 మెడల్స్ ను సాధించడం జరిగిందని, ఒకప్పుడు క్రీడలవైపు వెల్లే పిల్లలను చూసి వారి తల్లితండ్రులు కొంత బయాంధోళనకు గురయ్యేవారని, కాని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రోత్సహాన్ని అందిస్తుందని, క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. బాక్సింగ్ లో ప్రపంచస్థాయి ప్రతిభను కనబరిచిన తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు రెండుకోట్ల రూపాయాలను, బంజారహిల్స్ లో నివాసస్థలాన్ని ప్రభుత్వం అందించిందని తెలిపారు. క్రీడారంగాలలో ప్రపంచ స్థాయిలో ప్రతిభను కనబరిచిన పి.వి. సిందు, సానియామీర్జా సైన నెహ్వాల్ వంటి క్రీడాకారులను స్పూర్తితో అనుకున్నా గమ్యస్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని సాదించాలనే సంకల్పం దృఢంగా ఉన్నప్పుడే మీరందరు క్రీడాకారులుగా సునాయాసంగా ఎదగగలుగుతారని తెలిపారు.  

స్పోర్ట్స్ స్కూల్లో విశాలమైన స్థలంలో 1ఎకరం లో టేకు చెట్లను , హకీంపేటలో ఏర్పాటు చేసిన విధంగా ఒక ఎకరం లో కూరగాయల తోట ను  సూచించారు.  అంతకుముందు పిల్లల కొరకు క్రీడా పాఠశాల లోని మెస్ లలో రెండు కూల్ వాటర్ ప్యూరిఫయర్ లను ప్రారంభించారు.  ప్రాంతీయ క్రీడా పాఠశాలలో విద్యార్థులకు కావలసిన వస్తువులపై ప్రతిపాదనలు పంపించవలసిందిగా జిల్లా క్రీడ అభివృద్ధి అధికారి ఆదేశించారు.  అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రెటరీ  కరీంనగర్ పట్టణంలో నిర్మిస్తున్న  తీగల వంతెన,మానేరు రివర్ ఫ్రంట్, హారితా బడ్జెట్ హోటల్ నిర్మాణ పనులను పరిశీలించి  నాణ్యత ప్రమాణాలోసకాలంలో పనులను పూర్తిచేయాలన్నారు. నిర్మాణ పనులలో పలు సూచనలను జారీచేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్  మనోహర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జట్పి సిఈఓ ప్రియాంక, ట్రైని కలెక్టర్ వత్సల్ లెనిన్ టోప్పో, తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ డిప్యూటీ ఇంజనీర్ దీపక్, ఇంజనీరింగ్ చీఫ్ శంకర్ ఈ ఆర్ అండ్ బి  సాంబశివరావు, ఈ పంచాయతీ రాజ్ శ్రీనివాసరావు, జిల్లాయువజన మరియు క్రీడల అభివృద్ధి అధికారి రాజవీర్,  ఆర్డీవో ఆనంద్ కుమార్, స్పోర్ట్స్ స్కూల్ ప్రదానోపాద్యాయుడు  లీలాప్రసాద్,  ఇతర సిబ్బంది పాల్గోన్నారు.