అక్రమ ఇసుక డంపు సీజ్

అక్రమ ఇసుక డంపు సీజ్

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని మానేరు పరివాహక ప్రాంతం నుంచి అక్రమ రవాణా కు పాల్పడుతూ ఇసుక డంపు చేసుకున్న ముగ్గురి పై కేసు నమోదుచేసినట్లు జమ్మికుంట పట్టణ సిఐ రమేష్ తెలిపారు. సిఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తనుగులపరిధిలోని పరిమలసోసైటీ కాలనీ సమీపంలో మనేరు వాగు నుంచి ఇసుక అక్రమ తవ్వాకాలు చేసి, డంపు ఎర్పాటు చేసుకున్నారని సమాచారంతో కరీంనగర్ మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, సిబ్బందితో దాడులు చేసి 4500 క్యూబిక్ మీటర్ల ఇసుక డంపులు గుర్తించారు. ఇసుక దంబు చేసిన బల్మూరి మాధవరావు, రమేష్, చింతల మహేందర్, ముగ్గురిపై జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రమేష్ కు ఫిర్యాదు చేశారు. గిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.