బోనం ఎత్తిన మేయర్

బోనం ఎత్తిన మేయర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో పోచమ్మ భోనాల జారత ఘనంగా జరిగింది. నగరంలోని కమాన్ సమీపంలో గల వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నుండి పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకొని పోచమ్మ దేవాలయం వరకు డప్పు చప్పుళ్ళు, కోలాటాల నృత్యాలతో ర్యాలీగా వెళ్లారు. అనంతరం పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో నగర ప్రథమ పౌరులు మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై పోచమ్మ తల్లి భోనం ఎత్తుకున్నారు. అనంతరం 9 డివిజన్ పరిదిలోని కోతి రాంపూర్ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ బోనాల జాతరలో కార్పోరేటర్ ఐలేంధర్ యాదవ్, నాంపెల్లి శ్రీనివాస్, మాజీ కార్పోరేటర్ గొట్టెముక్కుల ఉమరాణీ రమణ, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.