48 గంటల్లో పొన్నం కు పార్టీ పదవి -  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్  మాణిక్ రావు ఠాక్రే

48 గంటల్లో పొన్నం కు పార్టీ పదవి  -  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్  మాణిక్ రావు ఠాక్రే

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమ నేత కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించి పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వాలని కోరుతూ ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డిసిసి కిసాన్ సెల్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు తో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల 700 మంది పార్టీ శ్రేణులతో కలిసి  గాంధీభవన్ తరలి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాణిక్ రావ్ ఠాక్రే  మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత పొన్నం ప్రభాకర్ ని కాంగ్రెస్ పార్టీ మరువలేదని, మరొక 48 గంటల్లో కార్యకర్తలు ఆయన మద్దతుదారులు ఊహించిన దానికంటే పెద్ద పదవి ఆయనకు కేటాయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అన్యాయం జరగదని, ఈ విషయంలో కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు అండగా ఉంటుందని  స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.జిల్లా నుండి గాంధీభవన్ కు తరలిన వారిలో జిల్లా కాంగ్రెస్ బీసీసీ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, సంగీతం శ్రీనివాస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి, డిసిసి మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, కాంగ్రెస్ నాయకులు వైద్యులు అంజన్ కుమార్, రామిడి రాజిరెడ్డి, రహమత్ హుస్సేన్, వెన్న రాజ మల్లయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల రాహుల్, డీసీసీ ఎస్.సి.సెల్ అధ్యక్షులు కొర్వీ అరుణ్ కుమార్, అబ్దుల్ రెహమాన్ లతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.