8 మంది ఆర్టీజన్లు అవుట్

8 మంది ఆర్టీజన్లు అవుట్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఎన్ పి డి సి ఎల్ కరీంనగర్ సర్కిల్ లోని హుజురాబాద్ డివిజన్లో పనిచేస్తున్న 8 మంది ఆర్టిజన్లను తొలగిస్తూ సంస్థ సీఎండి అన్నమనేని గోపాలరావు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో ఆర్టిజెన్లు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  ఎన్పీడీసీఎల్ సంస్థ ఆర్టిజన్లు సమ్మె చేస్తే ఉద్యోగాలు తొలగిస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం విధితమే. అనుకున్నట్టే బి మహేందర్, కే సమ్మిరెడ్డి, ఎన్ వెంకటేష్, టి గట్టయ్య, ఎం శ్రీనివాస్, పి రవి, సిహెచ్ తిరుపతయ్య, బి మల్లయ్య లు సమ్మెలో  పాల్గొన్నందుకు ఉద్యోగం నుండి తొలగించినట్లు ఎస్ఈ పేర్కొన్నారు. ఆర్టిజన్ల సమ్మెకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు బిజెపి, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. ఆర్టిజన్ల తొలగింపు ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.