ఉపాధి కూలీ పై అడవి పంది దాడి..

ఉపాధి కూలీ పై అడవి పంది దాడి..

మెట్‌పల్లి ముద్ర:- మండలంలోని మెట్లచిట్టాపూర్ గ్రామానికి చెందిన గుగ్లావత్ గంగుబాయి ఉపాధి కూలీ అదే గ్రామ శివారులో ఉపాధి హామీ పథకం పనికి వెళ్ళింది. పని మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెట్లలోకి వెళ్లగా ఒక్కసారిగా ఆమే పై అడవి పంది దాడి చేసింది. ఆమే అరవగా అరుపులు విన్న మీద కూలీలు అడవి పంది దాడి నుండి కాపాడి మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొట్ట తిప్పలకు ఉపాధి హామీ పనులకు వెళితే అడవి పందుల భయం ఉందని అడవి పందుల బారి నుండి కూలీలకు రక్షణ కల్పించాలని కూలీలు అధికారులను కోరుతున్నారు.