జీవనశైలిలో మార్పులుతో  పర్యావరణాన్ని పరిరక్షింవచ్చు

జీవనశైలిలో మార్పులుతో  పర్యావరణాన్ని పరిరక్షింవచ్చు

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : పర్యావరణాన్ని పరిరక్షించడానికి వ్యక్తిగత ,  సామూహిక చొరవ అవసరమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ బిఎస్ లతా, ఆర్డిఓ మాధురి, ఏవో నాగర్జున, పోల్యూషన్ కంట్రోల్ బోర్డు సహాయ సైంటిస్ట్ కనక జ్యోతి లతో కలిసి మిషన్ లైఫ్, లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ   మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని అన్నారు.'రిడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్' అనే కాన్సెప్ట్ భారతీయుల జీవనశైలిలో సంవత్సరాలుగా ఒక భాగమని అన్నారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సహాయం చేస్తుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పు కేవలం విధాన-సంబంధిత సమస్య అని, ప్రభుత్వాలు లేదా అంతర్జాతీయ సంస్థలు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాయని అందరిలోనూ ఒక అవగాహన ఉందన్నారు. కానీ ఇప్పుడు ప్రజలు వాతావరణ మార్పుల ప్రభావాలను అనుభవిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవనశైలిలో కొన్ని మార్పులు తీసుకొస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు.