ఈ పెట్టి కేసు ద్వారా నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు

ఈ పెట్టి కేసు ద్వారా నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు
  • సాక్షాదారాలతో శిక్షలు పడేలా పకడ్బందీ చర్యలు
  • జిల్లాలో ఫిబ్రవరి నెలలో 349 ఈ పెట్టి కేసులు నమోదు
  • జిల్లా ఎస్పీ  ఎగ్గడి భాస్కర్ 

ముద్ర ప్రతినిది, జగిత్యాల : జిల్లా పరిధిలో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్న వారిని అంతటితోటే వారి ప్రవర్తనలో మార్పు తీసుకుని రావడానికి, వారిని  కట్టడి చేయడానికి, భవిష్యత్తులో పెద్ద పెద్ద  నేరాలు చేయకుండా  నివారించడానికి ఈ పెట్టి కేసులు నమోదుచేయడం జరుగుతుందని  జిల్లా ఎస్పీ  ఎగ్గడి భాస్కర్ తెలిపారు. ఎస్పీ మాట్లడుతూ చిన్న నేరాల చేసినప్పుడే కేసు నమోదు చేసి,  కౌన్సిలింగ్ నిర్వహించి వారిని సక్రమ మార్గంలో నడపడానికి పోలీస్ అధికారులు సిబ్బంది కలసి  బ్లూ కోర్స్, పెట్రో కార్  తదితరులు గస్తీ నిర్వహించినప్పుడు ఈ పెట్టి  కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి  చిన్నపాటి నేరాలు చేసే అవకాశం ఉన్నందున వారందరిపై కేసులు నమోదు చేసి  కోర్టులో హాజరు పరచడం,  గ్రామాలలో పట్టణాలలో చిన్న చిన్న పెట్టి మ్యాటర్స్, తిట్టుకోవడం,  కొట్టుకోవడం, పబ్లిక్ ప్రదేశాలలో న్యూసెన్స్ చేయడం, ప్రజలకు ఇబ్బంది  కలిగించే విధంగా ప్రవర్తించే వారిలో మార్పు తేవడానికి కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టడం జరుగుతుందన్నారు.  జిల్లా  పరిధిలో గత ఫిబ్రవరి నెలలో 349 ఈ పెట్టి కేసులు నమోదు చేయడం జరిగిందని, బ్లూ కోర్స్ పెట్రో కార్ సిబ్బంది  విధినిర్వహణలో ఉన్నప్పుడు ట్యాబులల్లో ఫోటో తీసి అప్లోడ్ చేసి కేసు నమోదు చేసి తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించి  కోర్టులో హాజరు పరచడం జరుగుతుందన్నారు. ఇలా గత ఫిబ్రవరి నెలలో 312 మందిపై నమోదైన పెట్టి కేసుల్లో వారికి కోర్ట్ ద్వార జరిమానాలు విధించడం జరిగిందని ఎస్పి తెలిపారు.