రైతులు మల్బరీ సాగు పై మక్కువ చూపాలి

రైతులు మల్బరీ సాగు పై మక్కువ చూపాలి
  • జిల్లా ఉద్యాన అధికారి మరియన్న

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:మల్బరీ సాగుతో ఎకరానికిలక్ష రూపాయల ఆదాయం వస్తుందని రైతులు మల్బరీ సాగుపై మక్కువ చూపాలని జిల్లా ఉధ్యాన అధికారి జినుగు మరియన్న తెలిపారు. శనివారం ఆయన ములకలపల్లి పూసుగుడెం, చుంచుపల్లి మండలము, రాంపూర్ గ్రామంలో సాగులో ఉన్న మల్బరీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సాగులో చేపట్టాల్సిన జాగ్రత్తలు పద్ధతులు, సాంకేతిక సలహాలు, సూచనలును రైతులకు వివరించారు.  పట్టు పురుగుల పెంపకంలో షెడ్ నిర్మాణం, మల్బరీ తోటల పెంపకంపై అవగాహన,  ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు తెలిపారు.

పట్టుకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని, ఎలాంటి దళారి వ్యవస్థలు లేని పట్టు పరిశ్రమ సాగు రైతుకు  లాభదాయకమని తెలిపారు. ఆయిల్ పామ్ పంటలో మల్బరీ  తోటల సాగు అంతర పంట గా సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చనని తెలిపినారు. ఈ కార్యక్రమంలో రైతులు సున్నం గోపయ్య,  రవి, అగ్రికల్చరు అధికారి ch. కామేశ్వర్ రావు, కార్యాలయ అధికారి సముద్రాల విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.