జగిత్యాల పట్టణంలో పెరుగుతున్న కుక్కల దాడులు

జగిత్యాల పట్టణంలో పెరుగుతున్న కుక్కల దాడులు
  • యువతిఫై దాడి చేసి లాక్కెళ్ళిన కుక్క
  • భయం గుప్పెట్లో జగిత్యాల ప్రజలు
  • మున్సిపల్ చర్యలఫై కౌన్సిల్ సభ్యురాలు అసహనం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి, చిన్న పెద్ద అనే తేడా లేకుండ బయట తిరుగాలంటే ప్రజలు జంకుతున్నారు. నెల రోజుల క్రితం పట్టణంలోని హనుమానువాడలో ఓ బాలుడు తన ఇంటి ముందు నిలబడి ఉండగా వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది వెంటనే బాలుడి తళ్లితండ్రులు హుటాహుటిన పట్టణంలోని జిల్లా ప్రభుత్వా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా చికిత్స తీసుకుని కోలుకున్నాడు. 25  రోజుల క్రితం పట్టణంలోని బీట్ బజార్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముందు నుండి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై వీధి కుక్కలు దాడి చేశాయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగ కోలుకున్నారు. అయితే అదే ప్రాంతంలో కుక్కలు ఇప్పటికీ ముగ్గురిపై దాడి చేసి గాయపరిచినట్టు స్థానికులు తెలిపారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఆర్దిఓ కార్యాలయం వెనుక సంధిలో ఓ వృద్దుడిఫై కుక్క దాడి చేసి గాయపరచగ, బుధవారం 35 వ వార్డులో ఓ కుక్క  ఉదయం ఓ యువతీ ఫై దాడి చేసి కొంత దూరం లాక్కెళ్ళగా స్థానికులు వెంబడించి కర్రలతో కుక్కను తరిమి యువతిని కాపాడారు.

కలెక్టరేట్ కార్యాలయ రోడ్దులో, దరూరు క్యాంపులో కుక్కలు పదుల సంఖ్యలో సంచరిస్తూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వారిని కుక్కలు బయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. క్యాంపు లోనే మెడికల్ కళాశాల, మాత శిశు ఆసుపత్రి ఉండగా ఆసుపత్రికి వచ్చి పోయే రోగులు, వారి బంధువులు కుక్కల బెడదకు బయపడి పోతున్నారు. క్యాంపు నుంచి వైద్య కళాశాలకు వెళ్ళే దారిలో కుక్కల బెడద తప్పడం లేదని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. హోసింగ్ బోర్డు, కృష్ణనగర్, విద్యనగర్, పాత బస్టాండు, కరీంనగర్ రోడ్, రవీంద్రనాథు టాగూరు కాలనిలతో పాటు పలు వార్డుల కుక్కల బెడద పెరిగిందని అధికారులు  తగు చర్యలు తీసుకోవాలని  పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మున్సిపల్ చర్యలు శూన్యం....
అనుమల్ల జయశ్రీ , వార్డు కౌన్సిల్ సభ్యురాలు 
జగిత్యాల పట్టణంలో ప్రజల ఫై ఇన్ని దాడులు జర్గుతున్న మున్సిపల్ అధికారులు స్పందించక పోవడం బాధాకరం. చేతులు కాలక ఆకులు పట్టుకునేలా చేస్తున్నారు అధికారులు. పట్టణంలో క్కుకల బెడద నివారించాలి. కుక్కల పట్టి వేరే ప్రాంతానికి తరలించి తగు చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కలిపించాలి. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు కూడా చేశా.