హైకోర్టు ఆదేశాలతో  స్ట్రాంగ్ రూం తెరిచిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధకారి

హైకోర్టు ఆదేశాలతో  స్ట్రాంగ్ రూం తెరిచిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధకారి
  • తాళం చెవి లేదని, తెరవని 2 స్ట్రాంగ్ రూంలు
  • ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగిన ఉత్కoఠ..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మల్యాల మండలంలోని వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉదయం 10 గంటల నుంచి మ్యాహ్నం 3.30 గంటల వరకు తీవ్ర ఉత్కoఠ నెలకొంది.. జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదంపై స్ట్రాంగ్ గ్రూప్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను సమర్పించాలని హైకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎన్నికల అధికారి వి. ఆర్. కే. కళాశాలకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు కళాశాలలో ఈవీఏం లు భద్రపరిచి ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను తమ వద్ద ఉన్న తాళం చెవితో తెరిచె ప్రయత్నం చేశారు. అందులో నుంచి ఒక స్ట్రాంగ్ రూమ్ తాళం ఓపెన్ అయినప్పటికీ అందులో కోర్టుకు అవసరమైన సంబంధిత  పత్రాలు లేనట్లు సమాచారం. మిగతా రెండు స్ట్రాంగ్ రూములు తెరిచేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. తెరుచుకోకపోవడంతో మరో మారు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కొసం వెతికారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు తాళం చెవిల గురించి ఎంత వెతికిన లభించలేదని అధికారులు ప్రకటించడంతో  కలెక్టర్ తెరిచిన స్ట్రాంగ్ రూమును మళ్లీ సీజ్ చేసి అధికారులతో వెనుతిరి గారు.

 కోర్టు ఆదేశాలు...
గత అసెంబ్లీ ఎన్నికల్లో, లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరగడంతో తాను ఓటమి పొందాను అంటూ ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సుదీర్ఘ కాలంగా విచారణ జరిగిన ఈ అంశంపై హైకోర్టు ఎన్నికల అధికారికి పలు ఆదేశాలు జరిచేసింది. అయితే వారు సంతృప్తి చెందని సమాధానం ఇవ్వడంతో హైకోర్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బిక్షపతికి వారెంట్ జారీ చేసింది. తర్వాత ఈ నెల 4 న హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్, కేంద్ర, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులతో పాటు, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ప్రభుత్వ యంత్రాంగంకు లెక్కింపు ప్రక్రియ సమాచారం ఈ నెల 11 న సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలమెరకు జిల్లా కలెక్టర్  అభ్యర్థులను స్ట్రాంగ్ తెరిచే సమయం, స్థలం వివరిస్తూ హాజరు కావాలని ముందస్తు సమాచారం ఇచ్చారు.

 కోర్టు సూచనల మేరకు తదుపరి చర్యలు.. జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష.
 హైకోర్టు ఆదేశాల మేరకు తమ దగ్గర ఉన్న తాళం చెవిలతో మొత్తం ధర్మపురి అసెంబ్లీ కి సంబందించిన మూడు స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాం. అయితే PS NO 1 TO 107 రూమ్ తెరువలేకపోయినట్లు, PS NO 108 TO 269 రూమ్ ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఈవీఏంలు, 17 C, తదితర కీలక పత్రాలు భద్రంగా ఉన్నాయన్నారు. అలాగే మూడో స్ట్రాంగ్ రూమ్ C, D క్యాటగిరి మెటీరియల్ ఉన్నవి ఓపెన్ కాలేదన్నారు. ఇదంతా కూడా కోర్టుకు నివేదించి, వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుoటామన్నారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలి..
స్ట్రాంగ్ తెరిచి, కీలక పత్రాలు, సీసీ, వీడియో రికార్డ్ లు సమర్పించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిoచడంపై ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి రెండు తాళం చెవిలు కలెక్టర్ కంట్రోల్ లో ఉండాలని, అధికారులు తాళం చెవిలు దొరకడం లేదని, రూమ్ తెరవడానికి టెక్నీషన్ తో ప్రయత్నించడం అనుమానస్పందంగా ఉందన్నారు. ఇదంతా మంత్రి కొప్పుల ఈశ్వర్ కనుసన్నల్లో జరుగుతుందని ఆరోపించిన ఆయన ప్రభుత్వం సమాధానం చేప్పాలని డిమాండ్ చేశారు.

 రాజకీయ లబ్ది పొందెందుకు...
కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజకీయ లబ్ది పొందెందుకు ఆరోపణలు చేస్తున్నారని దిసి ఎమ్ ఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. టెక్నీషన్ని పిలిచి స్ట్రాంగ్ రూమ్ తెరిచే క్రమంలో తానే అడ్డు పడి, ఇప్పుడు ఇదంతా రాద్ధాంతం చేయడం  సరికాదన్నారు. రోడ్డు రోలర్ గుర్తు వల్ల కొప్పుల ఈశ్వర్ కి మెజారిటీ తగ్గిందని, ఆయనకు గెలుపు కొత్తేమీ కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో కొప్పుల గెలవడం ఖాయమన్నారు.