రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే రవిశంకర్ 

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే రవిశంకర్ 

ముద్ర, మల్యాల: రైతు సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం  ఎమ్మెల్యే మండలంలోని గొల్లపల్లె, మద్దుట్ల, రామన్నపేట, నూకపల్లి, మల్యాల క్రాస్ రోడ్డు, మల్యాల జూనియర్ కాలేజ్, ముత్యoపేట సబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని, దళారులకు పంట అమ్మొద్దని రైతులకు సూచించారు. పంట కొనుగోలు విషయంలో అధికారులు సమన్వయoతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు సూచించిన విధంగా రైతులు తమ పంటను కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఇక పొతే, కాళేశ్వరం నీళ్లతో చొప్పదండి నియోజకవర్గంలో సుమారు 70 వేల ఎకరాల్లో వారిసాగు చేశారని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్పంచ్ లు మిట్టపల్లి సుదర్శన్, బద్దం తిరుపతి రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు ఏ. సాగర్ రావు, బోయిన్పల్లి మధుసూదన్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, నాయకులు ఆసం శివ, నారాయణ, వలీ,  అధికారులు పాల్గొన్నారు.