కర్ణాటక ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారు 

కర్ణాటక ప్రజలు మత రాజకీయాలను తిప్పి కొట్టారు 
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • జగిత్యాలలో కాంగ్రెస్ కర్ణాటక  విజయోత్సవ సంబరాలు
  • బాణాసంచ పేల్చి, స్వీట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : మాట్లాడుతూ మతం పేరిట రాజకీయం చేసిన బీజేపీని కర్ణాటక ప్రజలు తిరస్కరించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో  కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తాలో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ  టి. జీవన్ రెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి, మిఠాయి పంపిణీ చేశారు.స్వయంగా జీవన్ రెడ్డి టపాసులు కాలాచ్చారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టిందని దాంతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మిషన్ భగీరథ పేరిట అవినీతికి పాల్పడిందని రాబోయేరోజుల్లో కర్ణాటక లో బీజేపీకి పట్టిన గతే కేసీఆర్ కూ పడుతుందన్నారు. అవినీతిలో కూరుకుపోయినా బీఆర్ఎస్ కూ తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధిచెబుతారని, కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవెందర్ రెడ్డి, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్,  మన్సూర్, బండ భాస్కర్ రెడ్డి, గుంటి జగదీశ్వర్, ధర రమేష్ బాబు, గాజుల రాజేందర్, బింగి రవి, చిట్ల అంజన్న, గుండా మధు, నేహాల్, విజయ్, రాజేష్, చిట్ల లత, పూర్ణ చందర్ రెడ్డి, చందా రాధాకిషన్, గంగాధర్, బెత్తెపు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు