ఆరోగ్య మహిళ “,  “మహిళా ఆరోగ్యం –ఇంటికి సౌభాగ్యం”

ఆరోగ్య మహిళ “,  “మహిళా ఆరోగ్యం –ఇంటికి సౌభాగ్యం”

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం ప్రతిష్టాత్మకముగా  మహిళల కోసం  సమగ్ర మహిళా ఆరోగ్య కార్యక్రమము “ఆరోగ్య మహిళ “,  మహిళా ఆరోగ్యం –ఇంటికి సౌభాగ్యం” రూపొందించడం జరిగిందని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాష అన్నారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ పిహెచ్సిలో మహిళ ఆరోగ్య మేల కార్యక్రమంలో భాగంగా పిహెచ్సి ని సందర్శించిన జిల్లా కలెక్టర్ మాట్లడుతూ  ఈ “ఆరోగ్య మహిళ “,  మహిళా ఆరోగ్యం –ఇంటికి సౌభాగ్యం” “కార్యక్రమమును  మార్చి 8న మహిళా దినోత్సవం సందర్బంగా ప్రారంబించి, మహిళలకు ఇప్పటి వరకు అందని అవసరమైన ఆరోగ్య సేవలను గుర్తించి అందజేయడం, అవసరమైతే  జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆసుపత్రులకు పంపి వైద్య సేవలు అందేవిదముగా చూడడం జరిగిందన్నారు. ప్రతీ మంగళవారము రాష్ట్ర వ్యాప్తము ఎంపిక చేయబడ్డ 100 ఆరోగ్య కేంద్రాలలో 8 రకాల వైద్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. 
ఆరోగ్య మహిళ ఉద్దేశాలను కలెక్టర్ వివరిస్తూ....
1. మహిళలకు ఇప్పటి వరకు అందని అవసరమైన ఆరోగ్య సేవలను గుర్తించి అందజేయడం.
2. మహిళల ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తన మెరుగు పరుచడం.
3. మహిళలకు సురక్షితమైన మరియు ( గోప్యత)/ప్రైవేటు వాతాణాన్ని కల్పించడం, తద్వారా మహిళలు ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చేవిధముగా ఆకట్టుకోవడం. 
4. మహిళల అవసరాలకు తగ్గట్టుగా ఆరోగ్య శాఖ సిబ్బందికి అవగాహన కల్పించడం. 
క్రింద పేర్కొన్న 8 రకాలకు సంబంచిన వైద్య సేవలు (పరీక్షలు) మహిళలకు అందించ బడును. 
1. వైద్య పరీక్షలు ( రక్త నమూనాలను సేకరించి జిల్లా కేంద్రములోని నిర్దారణ కేంద్రముకు పంపించడం)
2. క్యాన్సర్ పరీక్షలు/స్క్రీనింగ్ ( రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు గర్భాశయం సంభంచిన క్యాన్సర్).
3. సుక్ష్మ పోషక లోపాలు మరియు వాటి సవరణ మరియు చికిత్స/నిర్వహణ.
4. అండాశయ వ్యాధి నిర్వహణ (PCOD)/సిండ్రోం, ఋతుసమస్యలు మరియు కుటుంబ నియంత్రణ. 
5. మోనొపాజ్ (రుతువిరతి) నిర్వహణ .
6. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు (UTI) మరియ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు ( PID) ల నిర్వహణ. 
7. లైంగికముగా  సంక్రమించే అంటువ్యాధుల (STI) నిర్వహణ.
8. బరువు నిర్వహణ – ఉండవలసిన బరువు మరియు ఉన్న బరువు. 

ఈ కార్యక్రమము లో భాగంగా జిల్లలో (4) ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు మరియు (1) పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును గుర్తించినట్లు తెలిపారు.
1. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – నేరెళ్ళ 
2. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- కొడిమ్యాల
3. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- ఐలాపూర్
4. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- కథలాపూర్
5. పట్టాణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- జైశెట్టి రామ్ వెల్ ( జగత్యాల)
పైన గుర్తించిన ఆరోగ్య కేంద్రాలలోని మహిళా వైద్యులకు మరియ మహిళా స్టాఫ్ నర్సులకు ప్రత్యేకముగా హైదరాబాద్ లోని M.N.J Cancer Hospital  ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగినది మరియు కావలసిన వైద్య పరీక్షల పరికరాలు, మందులు మొదలైన వాటిని సమకూర్చినట్లు తెలిపారు. 
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రి లో అందించు వైద్య సేవలు:
జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరిన్ టేన్దేంట్ జగిత్యాల వారి అద్వర్యములో రెఫెర్ చేయబడ్డ మహిళలు  క్రింది సేవలు పొందవచ్చు.
1. Mammogram స్తనముల ప్రత్యేక ఎక్స్ -రే చిత్రణము తీసి పరీక్షించుట
2. Ultrasound - అల్ట్రాసౌండ్ పరీక్షలు
3. Colposcopy - కల్పోస్కపి పరీక్షలు
4. Cryotherapy
5. Pap smear/biopsy
6. Further diagnostics etc. 
ఒక వేల అవసరమనుకుంటే హైదరాబాద్ లోని శిక్షణ పొందిన రాష్ట్ర స్థాయి ఆసుపత్రిలోచికిత్సకు రిఫర్ చేసి ఫాలో అప్ చేయడం జరుగుతుందని, ప్రతి మంగళవారం శిక్షణ పొందిన మహిళా వైద్యులు మరియు మహిళా వైద్య సిబ్బంది ద్వారా మహిళలకు అందిచు వైద్య మొత్తం 4940 మహిళ లు నునమోదు కాగా వారికి వివద రకాల పరీక్క్షలు జరిపించి అందులో 247 మందిని ఉన్నత ఆసుపత్రులకు తగిన చికిస్థ కై సిఫారసు చేసినట్లు తెలిపారు. థైరాయిడ్ వ్యాది కి సంబండిచి 247 మందికి పరీక్షించి సమస్య ఉన్న 34  మంది మహిళలను గుర్తించి  వారికి  చికిస్థ అందించడం జరిగిందన్నారు.