తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం

తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ధ్వజం

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నాదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.   సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నాడు వడ్డేపల్లి లో జరిగింది.9 గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో  ప్రభాకర్ రెడ్డి తో పాటు జిల్లా ఇంచార్జి బోడకుంట్ల వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ వెంకటయ్య మనోహరరావు తో పాటు మండల పరిధిలోని నేతలు, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు మాట్లాడారు. గతంలో కరువుకు కేరాఫ్ రాయపోల్  మండలమని  ఎంపి గుర్తు చేశారు.

కరువు నివారించి బీడు భూముల్లోకి గోదావరి నీళ్లను పారించడానికే మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లను నిర్మించుకున్నామన్నారు.ఎంపీ గా రెండు మార్లు భారీ మెజారిటీ అందించారని,ఎంపీ గా కేంద్రంతో కొట్లాడి హైవేలకునిధులు తీసుకురావడం జరిగిందన్నారు. తెలంగాణలో నిర్మించిన నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్రం కోరుతున్న కేంద్రం పట్టించుకోకుండా వివక్ష చూపుతుందని ఎంపీ ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశేషమైన గుర్తింపు లభించిందని వచ్చే ఎన్నికల్లోను, తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని,  దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎంపీ తెలిపారు. రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ,రైతు బంధు లాంటి ఎన్నో పథకాలు. ప్రజలకు నేరుగా అందు అందుతున్నాయని  రైతులు సంతోషంగా సంతోషంగా ఉన్నారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని జిల్లా ఇంచార్జి బోడకుంట్ల వెంకటేశ్వర్లు ఆత్మీయ సమ్మేళనం సభలో చదివి వినిపించారు.