రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

నంగునూరు, ముద్ర: తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన పై రైతులకు క్షమాపణ చెప్పాలని నంగునూరు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని శివయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని రైతులకు కేవలం మూడు గంటలు విద్యుత్ ఇస్తే చాలని అనడం సిగ్గుచేటు అన్నారు.

దీంతో వాళ్ళ నీచ సంస్కృతికి నిదర్శనంగా స్పష్టమవుతుందని అన్నారు. గతంలో విద్యుత్తు ఇవ్వకుండా రైతులను హరిగోశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన బుద్ధి చెప్పక తప్పదు అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉల్లి చిన్న మల్లయ్య, ఎంపీటీసీ కోలా సునీత మహేందర్ గౌడ్, చింతల రాం రెడ్డి, తుమ్మకోలు మహేందర్ రెడ్డి, కోలా సతీష్ గౌడ్, ఆవుల పర్శరాములు,దేవులపల్లి కనకయ్య, ఎస్ కే ఆనందం,చెలీకాని మల్లేశం,రచ్చ సిద్దు, దసరి రమేష్, ఎరుకల రాజు,ఆకుబత్తిని రాము తదితరులు పాల్గొన్నారు.