రేవంత్ రెడ్డి రైతుల ముందు ముక్కు భూమికి రాయాలి 

రేవంత్ రెడ్డి రైతుల ముందు ముక్కు భూమికి రాయాలి 
  • టిపిసిసి అధ్యక్షుడి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం 
  • రైతు ఆర్థికంగా బలపడితే రాష్టం వృద్ధి చెందుతుంది 
  • కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది 
  • సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు దురదృష్టకరమని, ఆయన రైతుల సమక్షంలో ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.  జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో అనేక సంవత్సరాలు కరెంట్ కోసం రైతులు అలమటించారని, కరెంట్ లేక లక్షల ఏకరాలు ఎండిపోయిందని అన్నారు. అప్పుడు 3 గంటల కరెంట్ వస్తే తెలంగాణ వచ్చాక 24 గంటలు ఇస్తున్నామని అన్నారు. రేవంతు రెడ్డి మనుసులో మాట బయట పెట్టారని, అధికారంలోకి వచ్చాక అమలు చేస్తారు .. వారి నిజ స్వరూపం బయట పడిందని అన్నారు. రైతు ఆర్థికంగా బలపడితే రాష్టం వృద్ధి చెందుతుందని అన్నారు.

రైతుల కోసం 4.50 లక్షల కోట్లు ప్రభుత్వం వెచ్చించిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులూ విషాన్ని వెల గక్కుతున్నారని, ఉచితాలు వద్దని 24 గంటల కరెంట్ రైతులకు అవసరమా అని దుర్మార్గంగా మాట్లాడడం వారి నిజ స్వరూపానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆగ్రహంతో రగిలిపోయి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని అన్నారు. అబివృద్ధిని చూసి తట్టుకోలేక ఎదో ఒక రకంగా బద్నాం చేయాలని, అధికారం కోసం ఎ గడ్డి అయిన తినడానికి సిద్ధం అన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. 3 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను నాశనం చేసి మీ పార్టి విధానం అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇందుకు మూల్యం చెల్లించుకుంటుందని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా . చంద్రశేకర్ గౌడ్, జడ్పీటీసీ బాధినేని రాజేందర్ పాల్గొన్నారు.