రాజి మార్గమే రాజా మార్గం 

రాజి మార్గమే రాజా మార్గం 
Dismissal of 1617 cases in National Lok Adalat District Principal Judge G Neelima
  • జాతీయ లోక్ అదాలత్ లో 1617 కేసుల కొట్టివేత
  • జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ జి. నీలిమ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాజి మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జి. నీలిమ అన్నారు. జగిత్యాల జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 2018 వరకు 11184 కేసులు ఉండగా అందులో 1039 రాజుకి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించి వారికి నోటీసులు పంపామని శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 1617 కేసులలో కక్షి దారులు రాజిపడగ ఆ కేసులను పరిష్కరించి కొట్టివేసినట్లు తెలుపారు.

ఇందులో 23 సివిల్ కేసులు కాగా 1594 క్రిమినల్ కేసులు , 9 ఎంఓపి కేసులు ఉన్నట్లు తెలిపారు.  కోపంలో చిన్నచిన్న నేరాలు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన కాలం, డబ్బు వృధా చేసుకుంటున్నారని ఇలాంటివారు లోక్ అదాలత్ లో రాజి పడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కే. ప్రసాద్, న్యాయమూర్తులు జితేందర్, నిహారిక, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు , న్యాయవాదులు పాల్గొన్నారు.