సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి

సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి

ముద్ర, హన్మకొండ టౌన్: నాటి ఉద్యమ నేత నేటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి. కార్మికులు అభ్యున్నతికై ప్రతి జిల్లాకు ఒక్క కార్మిక భవన్ ఏర్పాటుకు అసెంబ్లీ సాక్షిగా ఆమోదించిన ముఖ్యమంత్రికి కార్మికులు వారి కుటుంబాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పంజాల మల్లేశం అన్నారు. హన్మకొండలోని వడ్డెపల్లి లో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సారధ్యంలో కార్మికులు హక్కులకై కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకోస్తు ఎన్నో పోరాటాలు చేసామన్నారు. 

కేసీఆర్ కార్మికులు ఆర్థిక అభివృద్ధి వారి అభ్యున్నతికై కృషి చెస్తుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మికులు హక్కులను కాలరాసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. వినయ్ భాస్కర్ చిరకాల కోరిక కార్మిక భవన్ ఏర్పాటు సీఎం కేసీఆర్ సహకారం తో నెరవేరబోతుందని సంతోషం వ్యక్తం చేసారు. కార్మికులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు సాధిక్, హన్మకొండ నగర అధ్యక్షులు సిరికొండ బిక్షపతి, జిల్లా గౌరవ అధ్యక్షులు పొనుగోటి కొండయ్య, కోశాధికారి రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.