నిరుపేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం. బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ సంజయ్

నిరుపేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం. బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ సంజయ్

మెట్‌పల్లి ముద్ర:- బి ఆర్ ఎస్ ప్రభుత్వ నిరుపేదలకు అండగా నిలుస్తుందని. బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ తో కలసి 22మంది లబ్ధిదారులకు 22 లక్షల 252 రూపాయల కళ్యాణ లక్ష్మి, 13మంది లబ్ధిదారులకు మూడు లక్షల 4 వేల  రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నిధుల విడుదలకు వెనుకాడడం లేదని. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని అన్నారు. వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్ బుచ్చి రెడ్డి, నాయకులు ఒజ్జేల శ్రీనివాస్, ఎనుగందుల శ్రీనివాస్, పింజరి హరీష్ లు ఉన్నారు.