కొండగట్టులో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం... 

కొండగట్టులో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం... 

పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ముద్ర, మల్యాల: ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ హనుమాన్ చాలిసా పారాయణo గత మూడు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన 30వ రోజు చాలీసా కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన సతీమణి రాధిక పాల్గొని, ఉత్సహoగా హనుమాన్ చాలీసా పఠిoచారు. అనంతరం కార్యక్రమంలో నిత్యం పాల్గొoటున్న భక్తులను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే వెంట బీఅర్ఎస్ నాయకులు దావ సురేష్, ఆధ్యాత్మిక గురువు మిట్టపల్లి లక్ష్మీనారాయణ, గుండేటి మోహన్, తదితరులు పాల్గొన్నారు.