పేద విద్యార్థులకు మెరుగైన ప్రభుత్వ విద్యను అందించడమే లక్ష్యం 

పేద విద్యార్థులకు మెరుగైన ప్రభుత్వ విద్యను అందించడమే లక్ష్యం 
The aim is to provide better public education to poor students
  • ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య
  •  జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ 
  • మన ఊరు-మన బడి కార్యక్రమ అమలు మన అందరి బాధ్యత

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పేద విద్యార్థులకు ప్రైవేటుకు ధీటుగా మెరుగైన విద్యను ప్రభుత్వ పాటశాలల్లో  అందించడమే లక్ష్యమని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మన ఊరు మన బడి కార్యక్రమం పై  అధికారులతో సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా  జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు  మన బడి కార్యక్రమం ద్వారా చేపడుతున్న పాఠశాలల పునరుద్ధరణలో నాణ్యత ప్రమాణాలు పాటించి జిల్లాలోని పాటశాలలో విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్ , డిజిటైలేషన్ మొదలగు వాటిని సమకూర్చి మోడల్ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాటశాలలో అడ్మిషన్ రేటు పెరిగిందని విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని,జిల్లాలోని  ప్రజా ప్రతినిధులు సొంత కార్యక్రమంగా భావించి పని చేయాలని జెడ్పీ ఛైర్మెన్ సూచించారు. మంజూరి అయిన అన్ని పనులను మే 15 లోగ చేయాలనీ అధికారులను ఆదేశించారు . ఈ సమావేశంలో సీఈఓ రామానుజాచార్యులు, డి.ఇ.ఓ జగన్ మోహన్ రెడ్డి, విద్యాశాఖఅధికారులు  , ఈఈలు, డిప్యూటీఈఈలు, ఏఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు .