రైతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

రైతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ముద్ర,సారంగాపూర్:నిబంధనలకు విరుద్ధంగా ప్రతి బస్తాకు నాలుగు నుండి ఐదు కిలోల వరకు అధికంగా జోకుతూ రైతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి గ్రామంలో గల సింగల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి ప్రతి బస్తాకు నాలుగు నుండి ఐదు కిలోల అధిక బరువుతో రైతులను మోసగిస్తున్న విషయం ఆయన దృష్టికి రాగా వెంటనే స్పందించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులను మోసం చేసిన విధానంపై జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ ను బీస్ లతకు ఫోన్లో సమస్యను వివరించారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి అధిక మొత్తంలో వరి ధాన్యం రైస్ మిల్లుల చేరినందున కొనుగోలు చేసిన వారి రైతులకు న్యాయం చేసి, రైతులను మోసం చేసిన సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  రామచంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.