మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా మన ఊరు మన బడి 

మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా మన ఊరు మన బడి 

కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  పాఠశాలలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే రాయికల్ మండల అల్లిపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా రూ. 1.29 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి  గ్రామానికి చెందిన ముగ్గురు లబ్దిదారులకు రూ . 1.80 లక్షల  చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, పాక్స్ ఛైర్మెన్ లు రాజ లింగం, రాజీ రెడ్డి, సర్పంచ్ గంగా రెడ్డి, ఎంపీటీసీ మోర విజయ లక్ష్మి వెంకటేష్, ఉప సర్పంచ్ సాగర్ రావు, ఎస్ఎంఎస్  ఛైర్మెన్ కల్యాణి, గ్రామ శాక రత్నాకర్ రావు, మండల సర్పంచుల ఫోరం శ్రీనివాస్, జిల్లా ఎంపీటీసీ ల ఫోరం నాగరాజు, మండల మహిళా అధ్యక్షురాలు స్పందన, ఎంపిడిఓ సంతోష్, డిఇ భాస్కర్, ప్రధానఉపాధ్యాయులు వెంకటయ్య, ఎస్టీ సెల్ బాపు రావు, సర్పంచులు, ఎంపీటీసీ లు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.