ప్రజలకు  చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని రాయికల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీలో జిల్లా ఎస్పీ భాస్కరు 

ప్రజలకు  చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని రాయికల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీలో జిల్లా ఎస్పీ భాస్కరు 

ముద్ర , రాయికల్ : ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి  పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి  సిబ్బంది పని తీరు గురించి  తెలుసుకొని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని అన్నారు.  గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని అసాంఘిక కార్యకలాపాలు ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రాయికల్ పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్ మరియు బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు దూరంగా ఉన్నప్పటికీ 15 నిమిషాల్లో చేరుకునే విధంగా పని చేస్తున్నారని తెలిపారు. రాయికల్ పోలీస్ స్టేషన్  అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు. 5s లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సిబ్బందికి ఏమన్నా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం అందించాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటి సిబ్బందితో కలిసి ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రకాశ్, సి. ఐ అరిఫ్ అలీ ఖాన్, ఎస్సై అజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.