ఎట్టకేలకు తెరుచుకున్న ధర్మపురి ఇవీయం స్ట్రాంగ్ రూం గది తలుపులు

ఎట్టకేలకు తెరుచుకున్న ధర్మపురి ఇవీయం స్ట్రాంగ్ రూం గది తలుపులు
  • ఎట్టకేలకు తెరుచుకున్న ధర్మపురి ఇవీయం స్ట్రాంగ్ రూం గది తలుపులు
  • హైకోర్ట్ ఆదేశాలతో  ధర్మపురి ఎన్నికల ఇవీఎం స్ట్రాంగ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
  • పలు ట్రంక్ పెట్టలకు లేని తాళాలు, ఉన్నవాటికి దొరకని తాళం చేతులు
  • హాజరైన బిఆర్ఎస్, కాంగ్రెస్కే పార్టీ ప్రతినిధులు 
  • కేంద్ర ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో వివరాలు నమోదు చేసిన అధికారులు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి ఎన్నికలకు సంబంధించి ఇవీఎంలు భద్రపరిచిన జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్ కే ఇంజనీరింగ్ కళాశాల  స్ట్రాంగ్ రూమ్ తాళాలు  హైకోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల అధికారి ప్రిన్స్ పల్ సెక్రెటరి అవినాష్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాష అధ్వర్యంలో పగలగొట్టి గదుల తలుపులు తెరిచారు. స్ట్రాంగ్ రూం తాళాలు పగలగోట్టేందుకు ఆయా రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావాలని ఇదివరకే సమాచారం ఇవ్వగా  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మన్ కుమార్ హాజరవగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతినిధిగా బాధినేని రాజేందర్ తో పాటు వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తాళాలు పగలగొట్టారు. ఇవీయంలు బద్రపరచిన గదులు తెరిచాక అధికారులు  అందులో ఉన్న 20 ట్రంక్ పెట్టెలో 16 పెట్టలకు అసలు తాళాలే లేవు, ఉన్న 4 ట్రంకు పెట్టెల తాళం చేతులు అధికారుల వద్ద లేక పోవడంతో వాటిని కూడా పగలగొట్టి తీశారు.

ధర్మపురి నియోజక వర్గంలో 268 పోలింగ్ బూతులకు సంబదిచిన   17 ఏ, 17 సి డాక్యుమెంట్లను పరిశీలించి, పోలింగ్ బూత్ ల వారిగా పాలైన ఓట్ల వివరాలు నమోదు చేస్తున్నారు, కోర్టుకు అందజేసేందుకు ప్రతులను జిరాక్స్ కాపీలు చేపించారు. ప్రతి పోలింగ్ బూత్ వారిగా రెండు డాక్యుమెంట్లను స్కాన్ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూము వద్ద జరిగే ప్రతి ప్రక్రియ వీడియో గ్రఫీ ద్వారా రికార్డ్ చేసి హైకోర్ట్ కు సమర్పించనున్నారు. ఈ ప్రక్రియలో  సాయంత్రం 6  గంటల వరకు 120 పోలింగ్ భూతుల 17 ఏ , 17 సి పత్రాలను నమోద్ చేశారు. మొత్తం పరిశీలించి సమాచారం సేకరించే వరకు అర్ధరాత్రి 1 గంట కావచ్చు అని అధికారులు తెలిపారు. అధికారులు రికార్డ్ చేసిన విడియో పుటేజి, స్కాన్, జిరాక్స్ చేసిన డాకుమెంట్లను జిల్లా కలెక్టర్ హైకోర్ట్ కు సమర్పించనున్నారు.  అయతే ఇది వరకు మీడియాను కళాశాల ఆవరణలోకి అనుమతించిన అధికారులు ఈ రోజు మాత్రం ఆర కిలో మీటర్ దూరంలో గేటు బయటే నిలిపి వేశారు. 

న్యాయపోరాటంలో నాకు న్యాయం జరుగుతుంది
అడ్లూరి లక్ష్మన్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి

కేంద్ర ఎన్నికల అధికారి వస్తే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ తాళాలు పోయిన విషయం చెప్పలేదు.  నాలుగు సంవత్సరాల క్రితం... ఇది క్యాబినెట్ మినిస్టర్,  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన అంశం.. తాళాలు పోయిన విషయంపై సిఎస్ కాని సీఎం గాని క్యాబినెట్ మంత్రి ఈశ్వర్ కూడా చెప్పలేకపోయారు. అయినప్పటికీ న్యాయం చాలా గొప్పది హైకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్రా ఎన్నికల అధికారి ఢిల్లీ నుంచి వచ్చిన  ప్రిన్సిపల్ సెక్రెటరీ అవినాష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సపరేట్ చేసి వివరాలను నమోదు చేస్తున్నారు. తర్వాత కోర్టుకు అందజేశాక నేను చేసే న్యాయపోరాటంలో నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. స్ట్రాంగ్ రూమ్ లోపల ట్రంకు పెట్టెలకు కూడా తాళాలు లేకపోవడం బాధాకరం 20 ట్రంకు పెట్టెల గాను నాలుగు ట్రంకు పెట్టలకు మాత్రమే తాళాలు పెట్టి ఉన్నాయి.. వాటిని కూడా పగలగొట్టి తెరిచారు. 17 సి పత్రాలు  అవసరం కాబట్టి ఆ తాళాలు పగలగొట్టి తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 13 రౌండ్ వరకు నాకు 3200 మెజార్టీ రాగా 14 రౌండ్లో 441 లతో కుప్పుల ఈశ్వర్ గెలుపొందారని ప్రకటించడంతో దీనిపై నేను అభ్యంతరం చెప్పాను. దీనిని ఆమోదించడం లేదని కేంద్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కు  మొరపెట్టుకున్నాను . అందుకు సంబంధించిన వీడియో పుటేజి కూడా ఉన్నాయి. నేను 14వ రౌండును రీకౌంటింగ్ చేయాలని కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పుడు లెక్కింపు చేసేందుకు సిద్ధంగా లేమని దాటవేశారు. 14వ రౌండ్ వి.వి ప్యాట్ స్లిప్ లు  లెక్కించాలని నేను మాట్లాడిన మాటల వీడియో రికార్డింగ్ లు కోర్టుకు వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది.

అన్ని సక్రమంగా జరిగాయి ఎటువంటి పొరపాటు జరగలేదు
బాదినేని రాజేందర్, జెడ్పిటిసి (మంత్రి కొప్పుల ఈశ్వర్ )

తాళాలు లేవని చెప్పిన వడ్లూరి లక్ష్మణు అన్ని తాళాలు ఉండి ఓపెన్ చేశారు. అన్ని సక్రమంగా జరిగాయి ఎటువంటి పొరపాటు జరగలేదు కావాలనే కొప్పులేశ్వర్ మీద అబండాలు వేస్తున్నాడు లక్ష్మన్. ఎన్నికల కమిషన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది.. అలాంటి ఎన్నికల కమిషన్ అవమానపాలు చేయడం సరికాదు.అన్ని పార్టీల సమక్షంలో అందరు అధికారుల సమక్షంలో చాలా ప్రతిష్టాత్మకంగా అన్నీ పనులు పూర్తి చేస్తున్నారు.ఒక్కసారి కూడా గెలవని లక్ష్మను ఈశ్వర్  పై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రజల ఆదరణ పొందాలని చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఈశ్వర్ కి ప్రజాదరణ పెరుగుతుంది.ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నాడు ఇకనైనా తెలుసుకోవాలి.ఇప్పటివరకు 90 వరకు బూతులు కంప్లీట్ అయినయ్ 200కు పైగా ఉన్నది కాబట్టి రాత్రి 12 ఒకటి అవకాశాలు ఉన్నాయి.

ఎందుకు స్ట్రాంగ్ రూము తాళాలు పగలగొట్టారు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్ 440  స్వల్ప ఓట్ల తేడాతో  ఓటమి పాలయ్యారు. ఈయనఫై కొప్పుల ఈశ్వర్ గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో  కొనసాగుతున్నారు. 14వ రౌండ్ ఈవీఎంల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరగడంతో తాను ఓటమి పొందానని  అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ఫై సుదీర్ఘకాలంగా విచారణ  జరిపిన హైకోర్టు ఈ కేసులో ఈవీఎంలు భద్రపరిచిన జగిత్యాల వీఆర్ కే కళశాల స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను, సిసి ఫుటేజ్ లను  తమకు సమర్పించాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ కు డైరెక్షన్ ఇచ్చింది. ఈమేరకు ఈ నెల10  హైకోర్టు ఆదేశాలతో  జగిత్యాల జిల్లా కలెక్టర్, (జిల్లా ఎలక్షన్ అధికారి)  ఈవీఎంలు భద్రపరిచిన వి.ఆర్.కే. ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూమ్ ను  తెరిచారు.

అందులో నుంచి ఒక స్ట్రాంగ్ రూమ్ తాళం ఓపెన్ అయినప్పటికీ అందులో కోర్టుకు అవసరమైన సంబంధిత  పత్రాలు లేవు. వారి వద్ద ఉన్న తాళం చేవిలతో  మిగతా రెండు స్ట్రాంగ్ రూములు తెరిచేందుకు ప్రయత్నం చేయగ తెరుచుకోకపోవడంతో తాళం చేవిలు మిస్స్ అయ్యాయని గుర్తించిన జిల్లా కలెక్టర్ మరుసటి రోజు స్ట్రాంగ్ రూము తాళం చెవిలు మిస్సింగ్ పై హైకోర్టుకు నివేదించారు. తాళం చేవిల మిస్సింగ్ ఫై విచారణ జరుపాలని కేంద్ర ఎన్నికల సంఘాని హైకోర్ట్ ఆదేశించగా దానిఫైన కొండగట్టు జేఎన్ టియులో అప్పటి, సంబంధిత అధికారులను పిలిపించి సిఇసి  విచారణ చేసింది.  ఈ మేరకు హైకోర్టు అభ్యర్థుల సమక్షంలో తాళాలు పగల గొట్టి అవసరం అయిన సమాచారాన్ని అందచేయాలని జిల్లా కలెక్టర్ కు  ఆదేశాలు జారి చేయగ, అధికారులు తాళాలు పగలగొట్టి ఎన్నికల సంచారాన్ని సేకరించారు.