సాగు నీటి రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శం: ఎమ్మేల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

సాగు నీటి రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శం: ఎమ్మేల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

 కోరుట్ల ముద్ర న్యూస్: సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మేల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కోరుట్ల పట్టణంలోని కావేరీ గార్డెన్స్ లో నీటిపారుదల శాఖ అధ్వర్యంలోసాగునీటి ప్రగతి ‌కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రగతి పత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీరు, వ్యవసాయం మరియు విద్యుత్ రంగాలపై గడిచిన 9 సంవత్సరాలలో అత్యధికంగా ఖర్చు చేసారు అని తెలిపారు.

ఓకవైపు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగిస్తూ, అభివృద్ధిని కూడా ఎక్కడ ఆపకుండా రాష్ట్రాన్ని ముందుకు సాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి అన్నం పెడుతుందని తెలిపారు. చెరువుల పుడుకతీత పనులు చేపట్టి కొన్ని లక్షల ఎకరాల పంటలకు సాగునీరు సాగునీరు అందించిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని కాలేశ్వరం ఎత్తిపోతలతో తెలంగాణ రాష్ట్రాన్ని శశశ్యామలచేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్, ఏంపిపిలు తోట నారాయణ, మారు సాయి రెడ్డి,మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్,కోరుట్ల జెడ్పిటిసి దరిషెట్టి లావణ్య రాజేష్,కోరుట్ల నియోజక వర్గ సర్పంచులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.