కార్యకర్త కుటుంబానికి  భరోసా పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్...  

కార్యకర్త కుటుంబానికి  భరోసా పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్...  

మంత్రి కొప్పుల ఈశ్వర్ 

వెల్గటూర్, ముద్ర : పార్టీ లో సభ్యత్వం తీసుకుంటున్న సమయంలో కార్యకర్తకు ఇన్సూరెన్స్ చేయడం ద్వారా అది వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం కరీంనగర్ లో తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ లో సభ్యత్వం తీసుకొని 2022 డిసెంబర్ 10న  రోడ్డు ప్రమాదం లో మరణించిన వెల్గటూర్ మండలం శానబండ గ్రామానికి చెందిన బొమ్మకంటి గణపతికి ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును ఆయన భార్య వెంకటమ్మకు అందజేశారు. ఈ సందర్బంగా  మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతు  ఏదైనా ప్రమాదం జరిగి కార్యకర్త  మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఊహించడం కష్టంగా ఉంటుందని, అట్లాంటి పరిస్థితులను అధిగమించేందుకోసం  తెలంగాణ ప్రభుత్వం సభ్యత్వ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చిందని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే  కార్యకర్త చనిపోయినా ఆ కుటుంబం సమాజంలో  గౌరవంగా, ధీమాతో బ్రతకాలన్నదే ఈ పథకం యెక్కముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.