ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా జిల్లాలోకి వచ్చే లిక్కర్ ని నిరోధించాలి

ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా జిల్లాలోకి వచ్చే లిక్కర్ ని నిరోధించాలి

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా జిల్లాలోకి వచ్చే లిక్కర్ ని నిరోధించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జిల్లా ఎస్పీఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్న ట్రాన్స్ పోర్ట్ లను జిల్లా పోలీసు అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బగా ఎస్పీ మాట్లాడుతూ అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి  రవాణా అయ్యేందుకు అవకాశమున లిక్కర్ అడ్డుకోవడంలో ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా పనిచేయాలని ఆన్నారు. అలాగే జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో అక్రమంగా గుడుంబా బట్టిలను గుడుంబా అమ్మేస్తావారాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా  కార్యాచరణ లో భాగంగా జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.