బీఆర్ఎస్ నేతలపై బీజేపీ కక్ష సాధింపు ధోరణి... 

బీఆర్ఎస్ నేతలపై బీజేపీ కక్ష సాధింపు ధోరణి... 
  • దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో టాప్...
  • మల్యాలలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 

ముద్ర, మల్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, తెలంగాణలో తమకు భవిష్యత్ ఉండబోదని బీజేపీ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. సోమవారం మల్యాలలో పర్యటించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ..  తెలంగాణ ఆడపడుచు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినoతమాత్రాన ఏం అయ్యేదిలేదని, కడిగిన ముత్యంలా... కవిత ప్రజల ముందుకు వస్తదన్నారు. దేశంలో ఎక్కడ చేయని విదంగా తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా వారి పాలిత రాష్టాల్లో ఇక్కడి పథకాలు అమలు చేయడం లేదన్నారు.

 59 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్...
మండలంలో 59 మందికి మంజూరైనా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం స్థానిక రైతువేదిక భవనంలో ఎమ్మెల్యే రవిశంకర్ లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల కోసం కేసీఆర్ ఎక్కడ లేని విదంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి ఆడపడుచు కేసీఆర్ ప్రభుత్వాన్ని మర్చిపోకుండా మరోమారు ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, సర్పంచ్ లు మిట్టపల్లి సుదర్శన్, బద్దం తిరుపతి రెడ్డి, రమేష్, మల్లమ్మ, ఎంపీటీసీ ఆగంతపు రావళి, సింగిల్ విండో అధ్యక్షులు ఆయిల్నేని సాగర్రావు, బోయిన్ పెల్లి మధుసూదన్ రావు, నాయకులు జనగాం శ్రీనివాస్, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, రౌతు రవి, ఎడిపల్లి అశోక్, ఆగంతపు వంశీదర్, తదితరులు పాల్గొన్నారు.

 65 లక్షల సీసీ రోడ్ల పనులు  ప్రారంభం ...
మల్యాల మండల కేంద్రంలో 65 లక్షల EGS నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే రవిశంకర్ సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, ఉపసర్పంచ్ పోతరాజు శ్రీనివాస్, వార్డ్ సభ్యులు మిట్టపల్లి దసరథo, నాయకులు గడ్డం రాజేశం, బద్దం రాజేశం, మిట్టపల్లి నరేందర్, బోడకుంటి అంజన్న, తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా, స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే రవిశంకర్ కు వినతి పత్రం అందజేశారు. పాఠశాల ఆవరణను రాత్రిపూట మందు బాబులు అడ్డాగా మార్చుకున్నారని, దాంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.