CPR పై ప్రతి ఒక్కరికీ  అవగాహన వచ్చినప్పుడే కార్డియా మరణాలు చాలా వరకు నియంత్రించవచ్చు- జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ 

CPR పై ప్రతి ఒక్కరికీ  అవగాహన వచ్చినప్పుడే కార్డియా మరణాలు చాలా వరకు నియంత్రించవచ్చు- జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా  CPR (హృదయ శ్వాసకోశ పురర్జీవనచర్య)  పై శిక్షణ పొందడం ద్వారా కొంతమేర గుండె పోటు  మరణాలను నియంత్రించే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు సిబ్బందికి CPR పై  శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులకు, సిబ్బంది కి  శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇటీవల కార్డియా అరెస్టుతో పలువురు యువకులు ఆకస్మిక మృతి చెందడం చాలా బాధాకరమైన దీని ద్వారా  ఎవరు మృతి చెందకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. CPR పై ప్రతి ఒక్కరికీ  అవగాహన వచ్చినప్పుడే కార్డియా మరణాలు చాలా వరకు నియంత్రణలోనికి వస్తాయని అన్నారు. ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన సందర్భాల్లో CPR విధానం ద్వారా గుండెకు రక్తప్రసరణం అందడం, నోటిద్వారా ఆక్సిజన్ అందించడం వల్ల గుండె పనిచేయడం ప్రారంభించి ప్రమాదానికి గురైనవారిని రక్షించవచ్చని తెలిపారు. నిత్యం ప్రజల మధ్యఉండే పోలీసులకు ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన వ్యక్తులు తారసపడే అవకాశం ఉన్నదందున, అన్నిస్థాయిలకు చెందిన పోలీసులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందినట్లయితే అలాంటి వ్యక్తుల ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. గుండెపోటు వచ్చిన వారికి  ఆన్ ది స్పాట్ CPR చేయడం వల్ల వారి యొక్క ప్రాణాలను కాపాడడం జరుగుతుందని, CPR ర్ చేసే కాలని  గోల్డెన్ హవర్ భావించడం జరుగుతుందని అన్నారు. సర్వేల ప్రకారం గుండెపోటు సంభవించినప్పుడు CPR చేయడం ద్వారా 60% ప్రాణాని కాపాడవచ్చు అని అన్నారు. పోలీస్ సిబ్బంది లో ముఖ్యంగా ట్రాఫిక్ విధులు, బ్లూ కోట్ , పెట్రో కార్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ యొక్క CPR పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ మరియు వైద్య శాఖ వారి సహాయంతో విడతల వారీగా జిల్లాలో ఉన్న ఆటోడ్రైవర్లకు, హోటల్లో పనిచేసే సిబ్బంది పెట్రోల్ బంక్ లో పనిచేసే వారికి ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా కార్డియా మరణాలు చాలా వరకు నియంత్రణలోనికి వస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమం లో  డిఎస్పీ ప్రకాష్ , డిప్యూటీ  DM&HO  శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్స్ శ్రీకాంత్, రవిశంకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వామనమూర్తి, నవీన్, టౌన్ ఇన్స్పెక్టర్ కిషోర్ , ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.