అపహారణకు గురైన అంబేద్కర్ శిలాఫలకాలు లభ్యం- యదస్థానంలో దిమ్మేకు అమర్చిన నాయకులు

అపహారణకు గురైన అంబేద్కర్ శిలాఫలకాలు లభ్యం- యదస్థానంలో దిమ్మేకు అమర్చిన నాయకులు

ముద్ర, మల్యాల: మండలంలోని తాటిపల్లి గ్రామంలో అపహారణకు గురైన అంబేద్కర్ శిలాఫలకాలు శనివారం తెల్లవారుజామున లభ్యమయ్యాయి. ఇటీవల గ్రామంలోని లంబాడిపల్లి చౌరస్తా వద్ద ప్రారంభించిన అంబేద్కర్ విగ్రహంకు సంబందించిన రెండు శిలాఫలకాలు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. శుక్రవారం జయంతి సందర్బంగా ఏర్పాట్లు చేసే క్రమంలో గమనించిన సర్పంచ్, సంఘ నాయకులు వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు.  ఈ క్రమంలో శనివారం శిలాఫలకాలు లభ్యoకావడంతో సర్పంచ్ బింగి జోష్ణవేణు ఆధ్వర్యంలో సంఘం నాయకులు వాటిని యదస్థానంలో దిమ్మకు అమర్చారు. శిలాఫలకాలు దొరికినప్పటికీ, నిందితులను కఠినంగా శిక్షించాలని నాయకులు బింగి వేణు డిమాండ్ చేశారు.